ప్రభుత్వ హాస్పిటల్ లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
పట్టుదలతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి
మహబూబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్
నవతెలంగాణ-నెల్లికుదురు
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని మహబూబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
మండల వ్యాప్తంగా ప్రజలకు మెరుగైన వేగవంతమైన వైద్య సేవలు అందించడం కోసం సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని షెడ్యూల్ ప్రకారం మెడికల్ క్యాంపులో నిర్వహించాలని, సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు, విద్య సంస్థలలో పిల్లలకు వంట చేసే సిబ్బందికి కచ్చితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని అట్టి నివేదికలు తమకు సమర్పించాలన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, గర్భిణీలకు పిల్లలకు బాలింతలకు సంబంధించిన టీకాలు క్రమం తప్పకుండా వేయాలని, మాతా శిశు మరణాలను అరికట్టాలని, హాస్పిటల్ కి వచ్చే ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ మెడిసిన్ రిజిస్టర్ లను అటెండెన్స్ రిజిస్టర్లు తనిఖీ చేశారు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ల వారీగా మందులను సిద్ధంగా ఉంచుకోవాలని, పిల్లలకు వ్యాక్సిన్ షెడ్యూల్ ప్రకారం వేయాలి, బోద కాలు, గర్భ సంచీ క్యాన్సర్ ల నివారణ చర్యలు తీసుకోవాలని, సూచించారు.
అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి ప్రతి తరగతి గదిని తనిఖీ చేసి పిల్లలతో స్వయంగా మాట్లాడి భవిష్యత్తు కార్యచరణ ప్రణాళిక పై వారిని అడిగి తెలుసుకున్నారు, క్రమం తప్పకుండా కళాశాలకు హాజరుకావాలని ప్రతి సబ్జెక్టుపై నాలెడ్జి పెంచుకోవాలని సూచించారు, ప్రతి విద్యార్థినీ ,విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ లోనే భవిష్యత్తు కార్యాచరణ పై అడుగులు పడతాయని గుర్తుకు చేశారు, పిల్లలు ,ఉపాధ్యాయుల హాజరు శాతం పూర్తిగా నమోదయ్యే విధంగా ప్రిన్సిపల్ చర్యలు తీసుకోవాలని తెలిపారు, ఇంగ్లీష్ ప్రతి సబ్జెక్టు పై ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, వంద శాతం ఉత్తీర్ణత పొందే విధంగా విద్యార్థినీ విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు,ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి మదర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్, నెల్లికుదురు తహసిల్దార్ నరేష్, ఎంపీడీవో కుమార్ , ఎస్సై కరుణాకర్ ,కళాశాల ప్రిన్సిపల్ వీరస్వామి, ప్రాథమిక వైద్యశాల అధికారి రమ్య, స్థానిక జిపిఓ ఉప్పలయ్య పంచాయతీ కార్యదర్శి దేవయ్య తదితరులు ఉన్నారు.






కామెంట్‌లు (0)