నవతెలంగాణ - హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ఇటీవల వెలుగుచూసిన సామూహిక లైంగికదాడి ఘటనలపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనలను సుమోటోగా విచారణకు తీసుకున్న ధర్మాసనం.. 2012 నిర్భయ ఘటన తర్వాత కూడా ఇలాంటి ఘటనలు కొనసాగడం ఆందోళనకరమని వ్యాఖ్యానించింది.
ఆస్తాకుంజ్ పార్క్, స్వరూప్‌నగర్, గ్రేటర్ నోయిడా నుంచి ఢిల్లీ వెళ్తున్న బస్సులో సామూహిక లైంగికదాడి ఘటనలను కోర్టు ప్రస్తావించింది. భద్రతా లోపాలను సరిదిద్దడంలో పోలీసులు విఫలమయ్యారని పేర్కొంది. రోడ్లు, బస్సులు, మెట్రో స్టేషన్లు, పార్కులను అధిక ప్రమాద ప్రాంతాలుగా ప్రకటించే పరిస్థితి రాకూడదని స్పష్టం చేసింది.





కామెంట్‌లు (0)