‘దాదాపు 20 ఏళ్ళ తర్వాత త్రివిక్రమ్ తో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ సినిమాలు క్లాసిక్ లవ్ స్టోరీలు. అలాంటి సినిమాల తర్వాత ఇప్పుడు త్రివిక్రమ్ మరో అద్భుతమైన కథను తీసుకొచ్చారు. ఇది అందరికీ నచ్చే సినిమా’ అని హీరో వెంకటేష్ అన్నారు. వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 - ఏకే47’ చిత్రం నుంచి మొదటి గీతం ‘నారాయణమ్మ’ విడుదలైంది. తమన్ స్వరాలు సమకూర్చిన ఈ హుషారైన పాటను ప్రభ, రామ్ మిరియాల ఆలపించారు. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ గీతావిష్కరణ వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. చిత్ర బృందమంతా ఈ వేడుకలో సందడి చేసి, ప్రచార కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించింది. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ, ‘ఇందులో ఎంటర్టైన్మెంట్, యాక్షన్, సెంటిమెంట్ అన్నీ ఉంటాయి. ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది. మీరు ఊహించని ట్విస్టులు ఉంటాయి. సినిమా చూసి మీరు ఖచ్చి తంగా ఎంజాయ్ చేస్తారు. ఆదర్శ కుటుంబం.. ఇది మామూలు కుటుంబం కాదు. వేరే లెవెల్. త్రివిక్రమ్ సినిమాని అద్భుతంగా హ్యాండిల్ చేశారు. తమన్ అద్భుతమైన పాటలు అందించారు. చినబాబు, నాగవంశీ బ్యానర్ లో సినిమా చేయడం సంతోషంగా ఉంది’ అని తెలిపారు. ‘మీ అందరి లాగే నా ఫేవరెట్ హీరో వెంకటేష్. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో, నేను మొట్టమొదటిగా పెన్ను పెట్టి రాసిన డైలాగ్ ఆయన సినిమాకే.. పవిత్ర బంధం. నా జర్నీ ఆయనతోనే స్టార్ట్ అయింది. ఆయన నాతో ఎంత క్లోజ్ గా ఉన్నప్పటికీ, నేను కాస్త భయంగానే ఉంటాను. గౌరవంతో కూడిన ఇష్టం వలన వచ్చిన భయం అనుకుంటాను అది. ఇన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా వెంకటేష్ సినిమా పట్ల అంతే తపన చూపిస్తూ ఉంటారు. ఒంట్లో బాగోకపోయినా సరే డబ్బింగ్ పూర్తి చేశారు. తమన్, రామజోగయ్య శాస్త్రి గురించి మాట్లాడటం అంటే మా ఇంట్లో మనుషుల గురించి మాట్లాడినట్టే. అక్టోబర్ 9న మనం థియేటర్స్ లో కలుద్దాం. అందరికీ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన లభించింది. వెంకటేష్ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా కనిపించడంతో పాటు.. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, యాక్షన్‌తో టీజర్ ఆసక్తిని పెంచింది. ఈ టీజర్ ఇప్పటికే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో 20 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది అని మేకర్స్ తెలిపారు.
మామూలు కుటుంబం కాదు..
51 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 2 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)