Magazines

ప్రేమా.. యుద్ధమా..?

49 నిమిషాల క్రితం

Love... or War?
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం

సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ‘లవ్ అండ్‌ వార్’. ఈ సినిమా నుంచి రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన తర్వాత శుక్రవారం మేకర్స్‌ కథానాయిక అలియా భట్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఈ పోస్టర్‌లో అలియా ఇంతకుముందెన్నడూ కనిపించని గ్లామరస్ లుక్‌లో మెరిసింది. వచ్చే ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఈ సినిమా ఒకటి. ఈ సినిమాలో సంజయ్ లీలా భన్సాలీ తన గత చిత్రాలకు భిన్నమైన ఆధునిక ప్రపంచాన్ని చూపించ బోతున్నారు. మేకర్స్ సోషల్ మీడియాలో అలియా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. విడుదలైన ఈ పోస్టర్‌లో అలియా స్లిట్ స్కర్ట్, ప్రత్యేకమైన హెడ్‌పీస్‌తో కుర్చీలో కూర్చుని కనిపించింది. ఆమె లుక్, స్టైలింగ్, హావభావాలు రెట్రో ఫీల్‌ను అందిస్తున్నాయి. ఈ పాత్రలో అలియా పూర్తిగా కొత్త అవతార్‌లో కనిపించనుందని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 21న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్