నవతెలంగాణ-హైదరాబాద్ : రేపటి నుంచి మూడు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్న నేపథ్యంలో, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. బ్యాంక్ సేవల పేరుతో నకిలీ లింకులు, APK ఫైల్స్ పంపే అవకాశం ఉందని, వివరాలు అప్డేట్ చేయకపోతే డెబిట్ కార్డులు, ఆన్‌లైన్, యూపీఐ చెల్లింపులు పనిచేయవని చెప్పే మోసాలను నమ్మవద్దని సూచించారు. ఏదైనా అనుమానం వస్తే, సంబంధిత బ్యాంకుల టోల్ ఫ్రీ నంబర్లు లేదా 1930 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.
రేపటి నుంచి బ్యాంకులు బంద్.. సైబర్ మోసాల పట్ల జాగ్రత్త
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)