దుబాయ్: ఐసిసి మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. మ్యాచ్‌లు క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (ముంబయి), వడోదర అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. కటాఫ్ డేట్ అయిన జులై 6 నాటికి మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో తొలి ఆరు స్థానాల్లో ఉన్న జట్లు ఇందులో పోటీపడనున్నాయి. దీంతో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక టోర్నమెంట్‌కు అర్హత సాధించాయి. ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్న పాకిస్థాన్ ఈ టోర్నమెంట్‌కు దూరమైంది. టీ20 ఫార్మాట్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతి జట్టు మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. టాప్-2లో నిలిచిన టీమ్‌లు ఫిబ్రవరి 28న జరిగే ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. మహిళల చాంపియన్స్ ట్రోఫీ-2027 మహిళల క్రికెట్‌లో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందని ఐసీసీ చైర్మన్ జై షా తెలిపారు. ఇటీవలికాలంలో ప్రతి ఏడాది ఒక ఐసిసి మహిళల టోర్నమెంట్ జరగడంతో మహిళల క్రికెట్‌కు ఆదరణ విశ్వవ్యాప్తంగా పెరుగుతోందన్నారు.
ఐసిసి మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం
03 సెప్టెంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 03, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)