Magazines

హైదరాబాద్‌లో రాపిడో ఫుడ్‌ డెలివరీ సేవలు

57 నిమిషాల క్రితం

Rapido
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : స్విగ్గీ, జొమాటోలకు పోటీగా రాపిడో తన ఫుడ్ డెలివరీ సేవ 'ఓన్లీ'ని హైదరాబాద్‌కు విస్తరించింది. బెంగళూరు తర్వాత భాగ్యనగరంలోనూ అందుబాటులోకి తెచ్చిన ఈ సేవలు జీరో కమీషన్ మోడల్‌ను అనుసరిస్తున్నాయి. రెస్టరంట్ల నుంచి సబ్‌స్క్రిప్షన్ ఫీజు వసూలు చేస్తూ, వినియోగదారులకు మెనూ ధరతో పాటు డెలివరీ ఛార్జీ మాత్రమే వసూలు చేయనుంది. ప్రస్తుతం 22 వేల రెస్టరంట్లతో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఓన్లీ, 42 లక్షల ఆర్డర్లను డెలివరీ చేసినట్లు తెలిపింది. రాపిడో తన కెప్టెన్ నెట్‌వర్క్‌ను ఫుడ్ డెలివరీకి ఉపయోగించుకోనుంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్