- Advertisement -
సంబరాలు నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు
నవతెలంగాణ – మల్హర్ రావు : ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్, అజాత శత్రువు స్వర్గీయ శ్రీపాదరావు చిన్న కుమారుడు, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు దుద్దిళ్ల శ్రీనుబాబును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనుబాబు సేవలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి పదవి ఇవ్వడంపై మంథని డివిజన్ కాటారం సబ్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాణసంచా పేల్చి, సంబరాలు నిర్వహించారు.
- Advertisement -