Saturday, May 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్

- Advertisement -

 నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  : జూన్’2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పరిశీలించారు. శనివారం కలెక్టరేట్ ప్రాంగణంలో వేడుకలు నిర్వహించే ప్రాంగణం, జెండా ఆవిష్కరణ స్థలం, పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఏర్పాట్లు, విద్యుత్, పారిశుధ్య సౌకర్యాలు తదితర అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు  సూచనలు సలహాలు చేశారు.రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా, సక్రమంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి, కలెక్టరేట్ ఏవో అంజిరెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -