– ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కాంప్లేంట్ అథారిటీ సభ్యులు డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : తెలంగాణ యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు చలకాని వెంకన్న యాదవ్ కు శనివారం భువనగిరి లోని ఉద్యోగుల విశ్రాంతి భవనం లో ఘనంగా విజయోత్సవ సన్మానం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా విద్యావంతుల వేదిక అధ్యక్షులు కొత్తపల్లి ఆనంద్ యాదవ్ అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర పోలీస్ కాంప్లేంట్ అథారిటీ సభ్యులు డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యావంతుల వేదిక బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులుగా గతంలో కొందరికే పరిమితం అయ్యేది. కానీ అందరికీ అవకాశం రావాలని చలకాని వెంకన్న యాదవ్ పోటీ చేసి గెలుపొందడం చాలా గొప్ప విషయం అని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదవ విద్యావంతుల వేదిక నాయకులు, తోటకూర యాదయ్య యాదవ్ , గుండె బోయిన అయోధ్య యాదవ్, సింగన బోయిన మల్లేశం యాదవ్, శెట్టి బాలయ్య యాదవ్, నరాల వెంకట స్వామి యాదవ్, మంటిపల్లి సతీష్ యాదవ్, పాక జహంగీర్ యాదవ్, వేల్పుల వెంకటేష్ యాదవ్, యాదవ కుల సంఘాల నాయకులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
భువనగిరి లో చలకాని వెంకన్న యాదవ్ కు ఘనంగా విజయోత్సవ సన్మానం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



