Monday, September 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలుశంషాబాద్ ఎయిర్‌పోర్టులో 20మంది మహిళలు అరెస్ట్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 20మంది మహిళలు అరెస్ట్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం నాడు భారీ వీసా మోసం బయటపడింది. నకిలీ వీసాలతో ఒమన్ వెళ్లేందుకు ప్రయత్నించిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 20 మంది మహిళలను ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహిస్తుండగా, మహిళలు సమర్పించిన వీసాలు నకిలీవని అధికారులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని, చట్టపరమైన చర్యల కోసం పోలీసులకు అప్పగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -