- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజైన సోమవారం, ఓటర్ల జాబితా సవరణ (SIR)పై చర్చించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీల నేతలు ఉభయ సభల్లో నిరసన తెలిపారు. దీంతో రాజ్యసభ, లోక్‌సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. అయితే, పార్లమెంట్‌లో SIR, ఎన్నికల సంస్కరణలపై చర్చించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లోక్‌సభలో డిసెంబర్ 9, 10 తేదీల్లో ఈ చర్చ జరగనుంది. డిసెంబర్ 8న వందేమాతరంపై చర్చ కూడా జరగనుంది.
- Advertisement -



