Wednesday, December 3, 2025
E-PAPER
Homeబీజినెస్ఎల్‌ఐసీ ఎండీగా రామక్రిష్ణన్‌ బాధ్యతలు

ఎల్‌ఐసీ ఎండీగా రామక్రిష్ణన్‌ బాధ్యతలు

- Advertisement -

ముంబయి : దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా రామక్రిష్ణన్‌ చందర్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఈ హోదాలో 30 సెప్టెంబర్‌ 2027 వరకు లేదా తదుపరి ఉత్వర్వులు వచ్చే వరకు కొనసాగనున్నారని ఎల్‌ఐసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఎండికి ముందు ఆయన ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌గా పని చేశారు. 1990లో అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌గా ఎల్‌ఐసీలో చేరిన రామక్రిష్ణన్‌ పలు హోదాల్లో విశేష అనుభవం కలిగి ఉన్నారు. ఎల్‌ఐసీ నిర్వహణలో ఆయనకు 35 ఏండ్ల అనుభవం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -