మహిళ మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ – హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద శనివారం ఆర్టీసీ ఎలక్టిక్ బస్సు, ముందు వెళ్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒక మహిళ తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు విజయవాడ వైపు నుంచి హైదరాబాద్‌కు కారులో వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు వేగానికి కారు వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. కారులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను పోలీసులు బయటకు తీసి, చికిత్స నిమిత్తం అత్యవసరంగా చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. అయితే మృతురాలి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఘోర రోడ్డు ప్రమాదం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



