నవతెలంగాణ – హైదరాబాద్: అఫ్గానిస్థాన్‌తో జరుగుతోన్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమ్ ఇండియా మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ ఆటలో భారత్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. తొలి రోజు ఆట ముగిసేసరికి.. మూడు వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. ఆరంభంలో ఓపెనర్లు కేఎల్ రాహుల్ (100: 165 బంతుల్లో 11 ఫోర్లు), యశస్వి జైస్వాల్ (24) పరుగులు రాబట్టారు. తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్ (81)తో కలిసి కేఎల్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 139 పరుగులు జోడించారు. క్రీజ్‌లో శుభ్‌మన్ గిల్ (103*), రిషభ్ పంత్ (50*) ఉన్నారు. వీరిద్దరూ ఇప్పటికే నాలుగో వికెట్‌కు 121 పరుగులు జోడించారు. అఫ్గాన్ బౌలర్లలో సలీమ్ సాఫి 2, రహ్మాన్ షరిఫి ఒక వికెట్ పడగొట్టారు. సెంచరీకి కాస్త దూరంలో సాయి.. శతకం చేసిన వెంటనే కేఎల్ ఔటయ్యారు. అయితే, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన స్ట్రోక్ ప్లేతో ఆకట్టుకున్నాడు. మరో ఎండ్‌లో రిషభ్ పంత్ అప్పుడప్పుడు హిట్టింగ్ చేయడంతో పరుగుల వరద పారింది. ఈ క్రమంలో గిల్ తన కెరీర్‌లో 11వ శతకం పూర్తి చేసుకోగా.. రిషభ్ పంత్ 19వ అర్ధశతకం ఖాతాలో వేసుకున్నాడు. దీంతో భారత్ స్కోర్ 368/3 తో ముగిసింది.
ముగిసిన మొదటి రోజు ఆట.. ఇండియా భారీ స్కోర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



