ప్రకృతి ఆధారిత పద్ధతులలో పంటలు సాగు చేయాలి: చెరుపు వరి పరిశోధన శాస్త్రవేత్తలు కృష్ణ చైతన్య
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
సేంద్రియ పద్ధతిని పాటించండి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందండి ప్రకృతి ఆధారిత పద్ధతులలో పంటలు సాగు చేయాలని ప్రాంతీయ చెరుకు వరి పరిశోధన శాస్త్రవేత్తలు కృష్ణ చైతన్య అన్నారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని 30 ఏప్రిల్ 2026 నుండి 23 మే 2026 వరకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 02.05.2026 నాడు పడ్కల్ (గ్రామం ) జక్రాన్ పల్లి (మం), నిజామాబాద్(జిల్లా) లో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో శాశ్రవేత్తలు మాట్లాడుతూ సింద్రియ వ్యవసాయం అనేది రసాయన ఎరువులు, కీటకనాశకాలు ఉపయోగించకుండా, సహజ వనరులు మరియు ప్రకృతి ఆధారిత పద్ధతులతో పంటలను సాగు చేసే విధానం. ఈ విధానం ద్వారా నేల ఆరోగ్యం కాపాడబడుతుంది, పర్యావరణం సంరక్షించబడుతుంది, అలాగే మనకు ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుందని, ప్రధాన సేంద్రియ వ్యవసాయ పద్ధతులు సేంద్రియ ఎరువుల వినియోగం, జీవ ఎరువులు, సహజ కీటక నియంత్రణ, పంట మార్పిడి మిశ్రమ పంటలు మల్చింగ్. సింద్రియ వ్యవసాయం ద్వారా రైతులు పర్యావరణాన్ని కాపాడుతూ, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచి, ఆరోగ్యకరమైన ఆహారం ఉత్పత్తి చేయవచ్చని అన్నారు. దీర్ఘకాలంలో ఇది సుస్థిరమైన లాభదాయకమైన వ్యవసాయ విధానం. రైతులు క్రమంగా రసాయనాల వినియోగాన్ని తగ్గించి సింద్రియ పద్ధతులను అవలంబించడం ఉత్తమం అని తెలియజేశారు.
సాగు నీటిని ఆదా చేయండి: సాగునీటిని సమర్ధవంతంగా వినియోగించడం అత్యంత అవసరం అన్నారు. నీటి వనరులు రోజురోజుకు తగ్గుతున్న నేపథ్యంలో, డ్రిప్ , స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సాగు పద్ధతులను అవలంబించడం ద్వారా నీటిని ఆదా చేయ వచ్చన్న రు. ఇది భవిష్యత్ తరాలకు నీటి వనరులను సంరక్షించడంలో సహాయపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ శ్రీమతి స్వప్న, శ్రీ పురుషోత్తం, గ్రామ ఉపసర్పంచ్, ప్రాంతీయ చెరుకు వరి పరిశోధన స్థానం శాస్త్ర వేత్తలు డా. ఎ. కృష్ణ చైతన్య, బి. మంజూభార్గవి ఏఈఓ సుభాష్య, గ్రామ రైతులు పాల్గొన్నారు.



