నవతెలంగాణ-రామారెడ్డి
హమాలీల కొరతతో మండలంలో వరి ధాన్యం కొనుగోలు జాప్యం జరుగుతుంది. సహకార సంఘాల ద్వారా కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా కొనసాగిన, మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలైన మోషన్ పూర్, ఇసన్న పల్లి, మద్దికుంట, తదితర గ్రామాల్లో హమాలి కొరతతో కొనుగోలు వేగవంతంగా జరగకపోవడంతో, నెలల తరబడి రైతులు కళ్ళల్లోనే రాత్రింబవళ్లు ఉండవలసి వస్తుంది. శనివారం మండలంలోని మోషన్ పూర్ , పోసానిపేట కొనుగోలు కేంద్రాల్లో మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి తోపాటు పలువురు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రభుత్వం వెంటనే స్పందించి గోనే సంచుల, హమాలీల కొరతను తీర్చి కొనుగోలు వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో ఇసన్నపల్లి హమాలీ కొరతతో రైతులే హమాలిగా పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండకు వరి ధాన్యం పూర్తిగా ఎండి , బరువు తగ్గడంతో రైతులు నష్టపోతున్నారని, ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి కళ్ళల్లోని ధాన్యాన్ని కొనుగోలును వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని, లేదంటే బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలతో నిరసనలు తెలుపవలసిన పరిస్థితి ఏర్పడుతుందని, రైతులు రోడ్ ఎక్కితే ప్రభుత్వాన్ని బాధ్యత అని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు బి ఆర్ ఎస్ నాయకులు, రైతులు ఉన్నారు.



