Saturday, May 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జంతువులకు జలం ఏర్పాటు 

జంతువులకు జలం ఏర్పాటు 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
వేసవిలో జంతువులకు త్రాగునీటి ఏర్పాటు కోసం అటవీ అధికారులు , అడవిలో సాసర్ ఫీట్లల్లో నీటిని ఏర్పాటు చేస్తున్నారు. మండలంలోని మద్దికుంట అడవి ప్రాంతంలో గ్రామపంచాయతీ సహకారంతో సాసర్ ఫీట్లల్లో  ట్యాంకర్ ద్వారా నీటిని ఏర్పాటు చేసి జంతువుల త్రాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. త్రాగునీటి సౌకర్యం లేక గతంలో ఎలుగుబంట్లు, చిరుతపులులు వంటి మృగ జీవాలు వ్యవసాయ క్షేత్రాల వద్దకు, గ్రామాలకు వచ్చి పశువులను, మనుషులపై దాడి చేసినా ఘటనలు ఉన్నాయి. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నీటి సౌకర్యాన్ని అడవి అధికారులు ఏర్పాటు చేయడం మంచి పరిణామం. మూగజీవులకు నీరు అందించడానికి గ్రామపంచాయతీ సహకరించి ట్యాంకర్ ద్వారా నిరం అందించడం అభినందనీయం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -