Saturday, May 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: కలెక్టర్

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి 
యువత ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలంటే చెడు అలవాట్లు, వ్యసనాలను దూరంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. శనివారం  నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా, మాదకద్రవ్యాల దుర్వినియోగం నివారణపై అవగాహన కల్పించేందుకు పోలీస్ మరియు ఉమెన్ & చైల్డ్ సేఫ్టీ విభాగం  ఆధ్వర్యంలో  నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి అతిథులుగా జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్,   జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలంటే చెడు అలవాట్లు, వ్యసనాలను దూరంగా ఉంచుకోవాలని సూచించారు. యువత క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకుంటేనే విజయాన్ని సాధించగలరని తెలిపారు. 

యువత “మత్తు పదార్థాలకు నో చెప్పండి  భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు చేరండి” అనిసమాజ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబం మరియు సమాజానికి తీవ్ర హానిని కలిగిస్తుందని తెలిపారు. ముఖ్యంగా యువత చెడు స్నేహితుల ప్రభావం, ఆసక్తి లేదా ఒత్తిడి కారణంగా డ్రగ్స్ వైపు మళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు. డ్రగ్స్ వినియోగం వల్ల మెదడు, గుండె, కాలేయం వంటి ముఖ్య అవయవాలు దెబ్బతింటాయని, మానసికంగా ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు.

అలాగే చదువుపై దృష్టి కోల్పోవడం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, నేరాలకు దారితీసే పరిస్థితులు ఏర్పడవచ్చని తెలిపారు. ఎవరైనా డ్రగ్స్ ఆఫర్ చేసినప్పుడు స్పష్టంగా “కాదు” అని చెప్పాలని, చెడు స్నేహితులను దూరంగా ఉంచుకోవాలని సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినప్పుడు వెంటనే 100 లేదా 1908 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. డ్రగ్స్ వినియోగం చట్టపరంగా నేరమని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం డ్రగ్స్ వినియోగం పై వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ  రమేష్, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి ,నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి , టూ టౌన్ సిఐ రాఘవరావు , వన్ టౌన్ సిఐ  రాజశేఖర్ రెడ్డి , ట్రాఫిక్ సిఐ  మహాలక్ష్మయ్య , ఉమెన్ & చైల్డ్ సేఫ్టీ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -