- Advertisement -
నవతెలంగాణ-ఆర్మూర్: మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి మున్నూరు కాపు సంఘం యందు మంగళవారం మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించినారు. పలు వార్డుల కౌన్సిలర్లు దినేష్, రవి గౌడ్, ప్రశాంత్, శ్రీనివాస్ లు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. మహిళా సంఘాలు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరినారు. ఈ కార్యక్రమంలో స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



