నవతెలంగాణ-హైదరాబాద్: రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛను ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకులు కె. నాగేశ్వర్ విషయంలో ఏపీ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF)రాష్ట్ర యాక్టింగ్ ప్రెసిడెంట్ పి.రాంచందర్, ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య, HUJ అధ్యక్షులు ఆరుణ్ కుమార్, కార్యదర్శి బి జగదీశ్వర్ ఖండించారు. AP రాజకీయాల నేపథ్యంలో డాక్టర్ నాగేశ్వర్ చేసిన మాటలు ఉపసంహరించుకున్నా రాజకీయ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
40 మంది AP పోలీసులు డాక్టర్ నాగేశ్వర్ ను అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ రావడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ప్రజాసమస్యలు, దైనందిన రాజకీయాల గురించి ఎప్పటికప్పుడు ప్రజలను, మేధావులు, సామాన్యులను చైతన్యం చేయడమే ధ్యేయంగా నాగేశ్వర్ పనిచేస్తున్నారని గుర్తు చేశారు. నాగేశ్వర్ ప్రసంఘాలు, వ్యాసాలు, పాడకాస్ట్ లకు ప్రజల్లో భారీ స్పందన ఉంటుందని గుర్తు చేశారు. ఒకవేళ ఆయన చెప్పేది తప్పైతే ప్రజలు స్పందించరనే విషయాన్నీ AP ప్రభుత్వం, పోలీసులు గ్రహించాలని హితవు పలికారు.
నోటీసులు ఇవ్వడానికి 40 మంది పోలీసులు అవసరమా అని ప్రశ్నించారు. ప్రొ.నాగేశ్వర్‌కు తెలంగాణ పోలీసులు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంతరెడ్డి స్పందించాలని నాగేశ్వర్ అరెస్ట్‌ను అనుమతించరాదనీ కోరారు. నాగేశ్వర్‌ను అరెస్ట్ చేసే ప్రయత్నాలను TWJF, HUJ అడ్డుకుంటాయాన్ని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో అనవసర ఉద్రిక్తలకు AP పోలీసులు కారణం కావొద్దని అభిప్రాయపడ్డారు. పాత్రికేయరంగానికి ప్రతినిధిగా ప్రొ.నాగేశ్వర్‌ను తాము చూస్తామని, అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.



