Tuesday, May 26, 2026
E-PAPER
Homeజిల్లాలుప్రొఫెసర్ కె నాగేశ్వర్‌ను అరెస్టు చేస్తే తీవ్ర పరిణామాలు: సీపీఐ(ఎం)

ప్రొఫెసర్ కె నాగేశ్వర్‌ను అరెస్టు చేస్తే తీవ్ర పరిణామాలు: సీపీఐ(ఎం)

- Advertisement -

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్: ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, జర్నలిస్టు, లిస్టు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై అక్రమంగా కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రయత్నించడాన్ని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ప‌త్రిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఏపీ పోలీసులు చేస్తున్న ఈ అక్రమ అరెస్ట్ ప్రయత్నాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అడ్డుకోవాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర డీజీపీ వెంటనే జోక్యం చేసుకుని నాగేశ్వర్‌కు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసింది.

రాజకీయ విశ్లేషకులు సమాజంలో జరిగే పరిణామాలను, తమకు ఉన్న సమాచారాన్ని బట్టి విశ్లేషించడం, ప్రజా బాహుళ్యంలో చర్చలు చేయడం సహజమైన విషయం. కానీ, తమ ప్రభుత్వంపై విమర్శలు చేయకూడదని, భిన్నమైన. అభిప్రాయాలు చెప్పకూడదనే అహంకారంతో మేధావుల నోరు నొక్కేందుకు ఆంధ్రప్రదేశ్ అధికార పక్ష నాయకులు, పోలీసులు ప్రయత్నించడం అప్రజాస్వామికం, మేధావులు, విశ్లేషకులు ప్రజా సమస్యలపై మాట్లాడితే, ప్రభుత్వాలు. మరియు ప్రతిపక్షాలు వాటిని అర్ధం చేసుకుని, లోపాలను సరిదిద్దుకునే వైఖరితో వ్యవహరించాలి. అలా కాకుండా అక్రమంగా అరెస్టులకు దిగడం రాజ్యాంగ విరుద్ధం, తప్పుడు కేసులు పెట్టి, జైళ్లకు పంపిస్తామంటూ భయభ్రాంతులకు గురిచేసే ఇలాంటి నిరంకుశ వైఖరిని సీపీఎం ఎంతమాత్రం సహించబోదు. ప్రశ్నించే గొంతు నాగేశ్వ‌ర్‌ను అరెస్ట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్‌వెస్లీ హెచ్చ‌రించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -