నవతెలంగాణ-ఊరుకొండ: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన ఊర్కొండ మండలంలోని ఊరుకొండ పేట గ్రామ శివారులోగల సూర్యలత కాటన్ మిల్లు సమీపంలో కల్వకుర్తి – జడ్చర్ల ప్రధాన రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కర్కస్ తండాకు చెందిన సభావత్ అంజినాయక్(48) రోడ్డుపై కాలినడకన వెళ్తుండగా.. గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టడంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించి కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రుడిని తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
గుర్తు తెలియని వాహనం ఢీ.. వ్యక్తికి తీవ్రగాయాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



