Tuesday, May 26, 2026
E-PAPER
Homeమెదక్అదనపు తూకం ఉంటేనే కొనుగోళ్లు..

అదనపు తూకం ఉంటేనే కొనుగోళ్లు..

- Advertisement -
  • అధికారుల అచేతన స్థితిపై మండల సీపీఐ(ఎం) అగ్రహం

నవతెలంగాణ-బెజ్జంకి: బస్తాకు కిలో అదనపు తూకం ఉంటేనే వరిధాన్యం కొనుగోలు చేస్తామని ఐకేపీ కొనుగోలు కేంద్రం నిర్వహాకులు చెబుతున్నారని మండల సీపీఐ(ఎం) నాయకులు అగ్రహం వ్యక్తం చేశారు.ఐకేపీ కొనుగోలు కేంద్రాల నిర్వహాకులు,రైస్ మిల్లర్లు కుమ్మక్కై అదనపు తూకం పేరుతో రైతులను దోపిడీ చేస్తున్నారని.. ఐకేపీ,రైస్ మిల్లర్లపై చట్టపరమైన చర్యలు చేపట్టి రైతులకు న్యాయం చేయాలని మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్ యందు తహసీల్దార్ శ్రీకాంత్ కు మండల సీపీఐ(ఎం) నాయకులు వినతిపత్రమందజేశారు.కొనుగోలు కేంద్రాల నిర్వాహాకులు,రైస్ మిల్లర్లు చేస్తున్న దోపిడీపై అధికారులు అచేతన స్థితిని వీడి చర్యలు చేపట్టాలని సీపీఐ(ఎం) నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్, నాయకులు బొమ్మిడి సాయికృష్ణ,సంఘ ఎల్లయ్య, బోనగిరి లింగం,బండి శ్రీకాంత్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -