Monday, June 1, 2026
E-PAPER
Homeసినిమాఘనంగా ఎస్వీ కృష్ణారెడ్డి 75వ పుట్టినరోజు వేడుక

ఘనంగా ఎస్వీ కృష్ణారెడ్డి 75వ పుట్టినరోజు వేడుక

- Advertisement -

సకుటుంబ కథా చిత్రాలతో తెలుగు తెరకు అద్భుత విజయాలు అందిం చిన దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి ప్రస్తుతం తన 43వ సినిమా ‘వేదవ్యాస్రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత కె . అచ్చిరెడ్డి సమర్పణలో నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి తన సాయి ప్రగతి ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పిడుగు విశ్వనాథ్ హీరోగా అరంగేట్రం చేస్తుండగా, కొరియన్ నటి జూన్ హ్యూంజీ, మంగోలియన్ నటుడు షరన్ బోల్డ్ సెగ్మెంట్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సోమవారం దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో పుట్టినరోజు వేడుకలతో పాటు 'వేదవ్యాస్ సినిమా మేకింగ్ వీడియో లాంచ్ చేశారు. 38 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ నుంచి వరల్డ్ రికార్డ్ గుర్తింపు పత్రాన్ని అందజేశారు. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ,’మన వేదాల గొప్పదనం, వాటి వెనక ఉన్న సైన్స్ గురించి చెబుతూ కృష్ణారెడ్డి ‘వేదవ్యాస్కథ సిద్ధం చేశారు. ఇలాంటి కథతో సినిమా చేస్తే నేటి సమాజానికి మంచిని చెప్పినట్ల వుతుందని ఆయన నాతో అన్నారు. నేను వెంటనే మూవీ చేసేందుకు అంగీకరించాను అని తెలిపారు.

‘నా పుట్టినరోజున నా మ్యూజిక్ కు ఒక రికార్డ్ దక్కింది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ వారి నుంచి మెమొంటో అందుకున్నాను. ఇంతకంటే అదృష్టం ఇంకేం కావాలి. మీరంతా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. నా రాబోయో వేదవ్యాస్ సినిమాను కూడా సక్సెస్ చేస్తారుఅని దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పారు. నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ,'నేను, కృష్ణారెడ్డి.. మా ఈ 43 చిత్రాల జర్నీలో నటీనటులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, ఇతర మిత్రులు సహకరించడం వల్లే మేము ఇక్కడి వరకు రాగలిగాం. ఈ వేడుక ఇంత ఘనంగా జరుపుకోగలిగాం. కృష్ణారెడ్డి మీద ఉన్న ప్రేమ, అభిమానం, నమ్మకంతో ప్రతాపరెడ్డి వేదవ్యాస్ సినిమాను రూపొందించేందుకు సంపూర్ణమైన స్వేచ్ఛ, సహకారం, ప్రోత్సాహం ఇచ్చారు. ఆ సహకారంతోనే ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఈ సినిమా చేస్తున్నాం. ఈ సినిమా మా అందరికీ కమ్ బ్యాక్ మూవీ అవుతుంది అని చెప్పారు. ‘వేదవ్యాస్మూవీ హీరో పిడుగు విశ్వనాథ్ మాట్లాడుతూ,'ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి లెజెండరీ డైరెక్టర్ చేతుల మీదుగా నేను హీరోగా లాంచ్ కావడం నా అదృష్టం. ఇలాంటి బర్త్ డే లు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నా అని అన్నారు. మురళీమోహన్, దర్శకుడు రేలంగి నరసింహారావు, నిర్మాతలు చదల వాడ శ్రీనివాసరావు, నిర్మాత దామోదరప్రసాద్, అశోక్ కుమార్, లయ, శ్రీకాంత్, జేడీ చక్రవర్తి, అలీ , శివాజీరాజా తదితరులు ఎస్వీ కృష్ణారెడ్డితో తమకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -