గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కొత్త మలుపు’ ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. భైరవి ఆర్థ్యా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం వహించగా, తాటి బాలకృష్ణ నిర్మిస్తున్నారు. తథాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ మూవీని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయనుంది. సోమవారం ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నటుడు భానుచందర్, గాయని సునీత, నిర్మాత సీ కళ్యాణ్, నటుడు రఘుబాబు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గాయని సునీత మాట్లాడుతూ, ‘ఆకాష్ ఎంతో కష్టపడే వ్యక్తి. మంచి స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. ఇది అతనికి రెండో సినిమా. దర్శకుడు శివ ప్రేక్షకులకు వినోదాన్ని పంచే కథను తీసుకొచ్చారు. మైత్రి సంస్థ ఈ చిత్రానికి అండగా నిలవడం గర్వకారణంఅని అన్నారు. 'ట్రైలర్ చాలా బాగుంది. హీరో, హీరోయిన్ ఇద్దరూ ఆకట్టుకున్నారు. ఈ చిన్న సినిమాను ప్రేక్షకులు పెద్ద విజయంగా నిలబెట్టాలి అని భానుచందర్ చెప్పారు. నిర్మాత తాటి బాలకృష్ణ మాట్లాడుతూ, ‘ఇది నాకు తొలి సినిమా. మా దర్శకుడికి తొలి చిత్రం. హీరోయిన్ కు తొలి సినిమా. హీరో ఆకాష్‌కు రెండో సినిమా. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగు తున్నాయిఅని తెలిపారు. 'ఈ చిత్రానికి మంచి కథ అందించిన దర్శకుడికి కృతజ్ఞతలు. మైత్రి మూవీస్ వంటి సంస్థ మద్దతు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది అని హీరో ఆకాష్ చెప్పారు.
హీరోయిన్ భైరవి ఆర్థ్యా మాట్లాడుతూ, ‘నా కెరీర్‌లో ‘కొత్త మలుపు’ చాలా ప్రత్యేకమైన చిత్రం. ప్రేమ, సస్పెన్స్, హాస్యం కలగలిపిన ఈ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది. ఈ సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది` అని అన్నారు.
భిన్న ప్రేమకథతో ‘కొత్త మలుపు’
- Advertisement -
- Advertisement -



