Monday, June 1, 2026
E-PAPER
Homeసినిమాఫిడెల్ కాస్ట్రోకు..

ఫిడెల్ కాస్ట్రోకు..

- Advertisement -

ఫిడెల్, ఫిడెల్, ప్రజలు కృతజ్ఞులు
చేతలోని మాటలకు, పాడే పనులకు.
అందుకే నా దూర దేశం నుంచి తెచ్చా
ఈ మధు పాత్ర ఇది అడుగునున్న జనాల రక్తం, చెమట నుంచి తయారు
వారు శతాబ్దాలుగా గడ్డకట్టిన నేల నుంచి
నిప్పు తీసిన గని కార్మికులు
బొగ్గు కోసం సముద్ర లోతుల్లోకి పోయి
బయటకు వచ్చినపుడు అనిపిస్తారు దయ్యాలు:
శాశ్వత చీకటి జీవులు,
పగటి కాంతికి దూరులు
ఈ మధు పాత్ర నిండా ఎన్నో వెతలు
చీకటికి, భ్రమలకు బందీలైన వారి సంతోషాలు
వారు గనుల లోతుల్లో నుంచి పసిగడతారు
ఆగామి ఉదాత్త వసంత ఋతు పరిమళాలు
ఎందుకంటే వారికి తెలుసు
మనిషి పోరాడుతున్నది
అత్యంత స్పష్టత కోసమని.
క్యూబాను చూస్తున్నారు
దక్షిణాది గని పనివారు,
పంపా మైదానాల ఒంటరి తనయులు,
పెటగోనియా శీతల ప్రాంత పశు కాపరులు,
వెండి , తగరం జనకులు,
రాగిని చూకీకమాటా నుంచి తవ్వేందుకు
పర్వత శ్రేణులను పరిణయమాడినవారు,
నిర్మలమైన గత స్మృతులు కల
జనం మధ్య దాగినవారు
పొలాల్లో, కార్ఖానాల్లోని శ్రామిక మహిళలు, తమ బాల్యాన్ని రోదనలో పోగొట్టుకున్న పిల్లలు:
అందుకో ఆ నిండు ఆశా పాత్రను ఫిడేల్
దాన్ని తాగితే తెలుస్తుంది నీకు నీ గెలుపు
అందరి మద్దతు నీకే
నీవు దీర్ఘకాలిక సమరంలో
సమిష్టి గౌరవ ప్రతినిధివి
క్యూబా కూలితే మేము రాలిపోతాం,
ఆమెను లేవనెత్తేందుకు మేము వస్తాం,
ఆమె విరులన్నింటితో వికసిస్తే
మేమిచ్చే అమతంతో వర్థిల్లుతుంది.
ఎవరైనా నీ చేత విముక్తమైన
క్యూబా నుదురును తాక సాహసిస్తే
వారికి ఎదురయ్యేది జనం పిడికిళ్లు
దాచిన మా ఆయుధాలు పైకి తీస్తాం
మా రక్తం, గర్వం వస్తాయి ముందుకు
మా ప్రియమైన క్యూబాను కాచేందుకు
మూలం : పాబ్లో నెరుడా
అనువాదం : డా.జె.రవీంద్రనాథ్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -