Saturday, June 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐకేపీ సీసీకి పంచాయతీ పాలకవర్గం సన్మానం

ఐకేపీ సీసీకి పంచాయతీ పాలకవర్గం సన్మానం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని బషీరాబాద్ గ్రామ పంచాయతీ  పాలకవర్గం ఆధ్వర్యంలో శనివారం ఐకేపీ సీసీ పిర్యా నాయక్ ను ఘనంగా సత్కరించారు. గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రం ద్వారా వరి ధాన్యం సేకరణలో సీసీ పిర్యా నాయక్ చేసిన కృషిని అభినందిస్తూ సర్పంచ్ బైకాన్ జమున మహేష్ ఆధ్వర్యంలో పంచాయతీ పాలకవర్గం సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జమున మహేష్ మాట్లాడుతూ గ్రామంలో ఐకెపి కొనుగోలు కేంద్రం ద్వారా 108లారీల వడ్లు సేకరించడం జరిగిందన్నారు. చెడగొట్టు వర్షం పడినరోజున ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రైతుల కల్లాల వద్దకు వచ్చి పరిశీలించిన సమయంలో వడ్లు మొత్తం కల్లాల్లోనే  ఉన్నాయన్నారు.

రైతుల పరిస్థితిని అర్థం చేసుకున్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మోర్తాడ్ లో ధర్నా చేయడం వలన ప్రభుత్వం, అధికారులు కొనుగోల్లను  వేగవంతం చేయడం వలన ఎవరికీ నష్టం జరగకుండా వడ్లు కొనుగోలు సాఫీగా సాగిందన్నారు. అదేవిధంగా సీసీ పీరియా కొనుగోలు కేంద్రం వద్ద ఎంతో శ్రమకూర్చి రైతుల ధాన్యం రైస్ మిల్లులకు చేరేలాగా కృషి చేశాడన్నారు.కొనుగోళ్లకు సహకరించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి, మండల జిల్లా అధికారులకు గ్రామ రైతు ల తరపున సర్పంచ్ జమున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిలువేరి భూమేశ్వర్, పంచాయతీ కార్యదర్శి నవీన్ గౌడ్, వార్డ్ సభ్యులు, రమేష్, రాజు, శేఖర్, లావణ్య, రాకేష్, లక్ష్మి, రవి, శ్రీనివాస్, గ్రామ స్థాయి అధికారులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -