Saturday, June 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం: సర్పంచ్

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం: సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ 
గ్రామ శుభ్రత మన బాధ్యతగా తీసుకొని పరిసరాలను శుభ్రంగా చూస్తూ ఆరోగ్యమైన జీవితంలో ఆనందంగా జీవిద్దామని మాలపల్లి గ్రామ సర్పంచ్ వెన్న స్వర్ణలత సూచించారు. శనివారం మండలంలోని మాలపల్లి గ్రామంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. సైడ్ డ్రైన్స్ రిపేర్, నూతన కరెంటు పోల్స్ ,స్మశాన వాటికలో జంగల్ కటింగ్, పోచమ్మ గుడి వద్ద ప్రత్యేక మరమ్మత్తుల తో పాటు పలు అభివృద్ధి పనులకు తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో  గ్రామ సర్పంచ్  వెన్న స్వర్ణలత రాజు, ప్రత్యేక అధికారిని మండల ఎంఈఓ మనీల, పంచాయతీ కార్యదర్శి దివ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -