నవతెలంగాణ – హైదరాబాద్ : కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ లెబనాన్‌పై ఇజ్రాయిల్ సైన్యం దాడుల్ని కొనసాగిస్తూనే ఉంది. శనివారం దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయిల్ సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఒక సీనియర్ అధికారితో సహా సైనికులతోపాటు పలువరు మరణించారని లెబనీస్ సైన్యం వెల్లడించింది. మొత్తంగా ఈ దాడుల్లో 9 మంది మృతి చెందారు. శనివారం ఉదయం నబతియే నగరాన్ని మర్జయూన్ పట్టణంతో కలిపే రహదారిపై ఇజ్రాయిల్ సైన్యం జరిపిన వైమానిక దాడిలో ఒక బ్రిగేడియర్ జనరల్, ఒక కెప్టెన్, మరో సైనికుడు మరణించినట్లు లెబనీస్ సైన్యం తెలిపింది. వారు ప్రయాణిస్తున్న వాహనం పూర్తిగా ధ్వంసమయింది. అయితే ఈ ఘటనలో మృతుల పేర్లను మాత్రం వెంటనే వెల్లడించలేదు. కాగా, ఇజ్రాయిల్ సైన్యం చేసిన మరో వైమానిక దాడిలో దక్షిణ సక్సకియా గ్రామంలో ఆరుగురు మరణించగా, నలుగురు గాయపడ్డారని ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులు..9 మంది మృతి
- Advertisement -
- Advertisement -



