- Advertisement -
నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలం లోని ఎడ్ బిడ్ గ్రామానికి చెందిన ఇద్ధెం విఠల్ రెడ్డి (59) అనే వ్యక్తీ జీవితం పై విరక్తి చెంది చెరువులోపడి మృతి చెందినట్లు ముధోల్ ఎస్ఐ బిట్ల పెర్సెస్ తెలిపారు.ఎస్ఐ కథనం ప్రకారం, విఠల్ రెడ్డి గత నాలుగు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.శనివారం సుమారు 8:30 గంటల సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్తానని చెప్పి వెళ్లిన తిరిగి ఇంటికి రాలేదు. అనంతరం గ్రామంలోని చెరువులో ఆయన మృతదేహం లభ్యమైంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, మద్యం మత్తులో జీవితం పట్ల విరక్తి చెంది చెరువులో పడిపోయి, ఈత రాక మృతి చెందాడాని పేర్కొన్నారు .మృతుని భార్య పుష్పాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
- Advertisement -



