Sunday, June 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబంగారం, వెండి ధరలు డౌన్

బంగారం, వెండి ధరలు డౌన్

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: భారత్‌లో గత మూడు రోజులుగా బంగారం, వెండి ధరలు త‌గ్గుతున్నాయి.నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,52,730గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,40,000ల వద్ద కొనసాగుతోంది. నగరంలో కిలో వెండి ధర రూ.2.7 లక్షలుగా ఉంది. విజయవాడలో కూడా దాదాపుగా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

ఇక దేశంలోని ఇతర ప్రధాన నగరాల విషయానికి వస్తే చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,54,910గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,000గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,730ల వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1.4 లక్షల వద్ద కొనసాగుతోంది. దేశరాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,910గా ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,40,150 వద్ద కొనసాగుతోంది. నిన్న భారత్‌లో మేలిమి బంగారం సగటు ధర రికార్డు స్థాయిలో రూ.3 వేల మేర తగ్గింది. వెండి ధరలో రూ.10 వేల మేర కోత పడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -