Sunday, June 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారున్ని సన్మానించిన ఎంపీడీఓ

నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారున్ని సన్మానించిన ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని మడంపల్లి గ్రామానికి చెందిన బిరాదార్ శివరాజ్ ఇందిరమ్మ గృహ పథకంలో ఇటీవలే నాలుగు నెలల క్రితం భూమి పూజ చేసి నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన గ్రామ సర్పంచ్ వాగ్మారే విజయ కుమారి సంజు ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల పరిషత్ అధికారి ప్రోత్సాహంతో నిర్మాణాలను వేగవంతంగా లబ్ధిదారుడు పూర్తి చేసారు. పనులు ప్రారంభించగానే విడతల వారీగా ఇందిరమ్మ గృహ పథక హౌసింగ్ అధికారులు తన ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగిందని, అందుకే పనులు సకాలంలో పూర్తి చేయడం జరిగిందని లబ్ధిదారుడు సంతోషంతో గ్రామస్తులకు తెలియజేశారు.

త్వరలోనే లబ్గృధిదారుడు గృహ ప్రవేశానికి ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో తెలుసుకున్న గ్రామ సర్పంచ్ ఎంపీడీవోకు సమాచారం అందించారు. నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహ పథకం గృహాన్ని ఎంపీడీవో మరియు హౌసింగ్ ఏఈ ఉమేష్ సందర్శించారు. సకాలంలో పూర్తి చేసిన లబ్ధిదారులకు దంపతులిద్దరికీ ఎంపీడీవో శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ విజయ కుమారి శాలువాతో సన్మానించి,  సత్కరించి జ్ఞాపికను అందించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఎంపీడీవో, హౌసింగ్ ఏఈ, గ్రామ సర్పంచ్ , ఉప సర్పంచ్ పావుడే సవిత, జిపి కార్యదర్శి గంగాధర్,  ఆశా  కార్యకర్త జంగం భాగ్యశ్రీ, , నాయకులు వాగ్మారే సంజు, పావుడే బస్వంత్ శ్రీను , సీనియర్ నాయకుడు వాగ్మారే విట్టల్, గ్రామస్తులు, జిపి కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -