Sunday, June 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృగశిర కార్తె..జోరుగా చేపల విక్రయాలు

మృగశిర కార్తె..జోరుగా చేపల విక్రయాలు

- Advertisement -

నవతెలంగాణ-బాల్కొండ
మృగశిర అనగానే గుర్తొచ్చేది చేపలు. ఈ కార్తె మొదటి రోజు చేపలు తినడం ఎన్నో ఏండ్లుగా ఆనవాయితీగా వస్తున్నది. కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు. ప్రధానంగా ఉబ్బసం, ఆయాసం ఉన్నవారికి ఈ చేపలు ఎంతో మంచిది. దీంతో చేపల మార్కెట్లలో ఆదివారం రద్దీ పెరిగింది. మండల పరిధిలోని చేపల మార్కెట్లన్నీ ప్రజలతో కిక్కిరిసిపోయాయి. బాల్కొండ చేపల మార్కెట్‌ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నది. దీంతో చేపలకు ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడింది. చేపల కోసం జనాలు క్యూ కడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -