– అంతర్మదనంలో పడ్డ ఈవెంట్ పోషకులు
– అనుమతులు ఇచ్చిన అధికారులు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొక్క తప్పదంటున్న నాయనిపుణులు
నవతెలంగాణ-భద్రాచలం : దక్షిణ అయోధ్యగా విరుదులుతున్న భద్రాచలం ఆధ్యాత్మిక చరిత్ర మసకబారే విధంగా కొందరు అత్యుత్సాహంతో నిర్వహించ తలపెట్టిన అశ్లీల జబర్దస్త్ ఈవెంట్ పై నీలి నీడలు కమ్ముకున్నాయని తెలుస్తుంది. ఇప్పటికే నవతెలంగాణ దినపత్రికలో గత మూడు రోజుల నుండి కథనాలు రావడంతో పాటు పలువురు సామాజిక సంఘ నాయకులు విద్యార్థి సంఘ నాయకులు మహిళా సంఘ నేతలు అధికారులను సైతం కలిసి వినతి పత్రాలు అందించిన నేపథ్యంలో జబర్దస్త్ నిర్వహణపై నిర్వాహకులు పునరాలోచన పడ్డారని తెలుస్తుంది. జబర్దస్త్ సాంస్కృతి నృత్యం పేరుతో అనుమతులు పొందిన అధ్యంతం అశ్లీలంతో కూడిన జబర్దస్త్ మెగా ఈవెంట్ నిర్వహిస్తే తర్వాత జరిగే పరిణామాలు పై ఆందోళన చెందుతున్నారని తెలుస్తుంది.
అంతర్ మదనంలో పడ్డ ఈవెంట్ పోషకులు
ఆధ్యాత్మిక చరిత్ర గల భద్రాచలంలో ఇప్పటివరకు క్రమశిక్షణతో కూడిన వ్యాపారాలను నిర్వహించుకుంటూ ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే నాణ్యతతో కూడిన నమ్మకమైన వ్యాపారాలు చేస్తూ రాష్ట్రంలోనే ఓ ప్రత్యేకతను చాటిన పట్టణ వ్యాపారస్తులు జబర్దస్త్ నిర్వాహకుల అసత్య ప్రచారాన్ని నమ్మి పోషకులుగా అంగీకరించినప్పటికీ గత మూడు రోజుల నుండి జబర్దస్త్ పై జరుగుతున్న ప్రచారం ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను గుర్తించి ఈవెంట్ కి పోషకులుగా ఉండటం వల్ల తమ వ్యాపార సముదాయాలపై ఇప్పటివరకు ఉన్న మంచి పేరు కాస్త మసకబారే ప్రమాదం ఉందని అంతర్ మదనలో పడ్డారని తెలుస్తుంది. పుణ్యక్షేత్రం పేరుతో యాత్రికులకు ఆతిథ్యం ఇచ్చే వ్యాపార సముదాయాలు నేడు అశ్లీల కంటెంట్ తో కూడిన జబర్దస్త్ కి ప్రచారకర్తలుగా వ్యవహరిస్తే దక్షిణ అయోధ్య ప్రతిష్ట మసకబారటంలో తమ పాత్ర కూడా ఉంటుందన్న అవమానంతో భవిష్యత్తులో తమ వ్యాపారాలపై ప్రభావం చూపుతోందని ఆందోళన చెందుతున్నారని తెలుస్తుంది.
న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోక తప్పదు అంటున్న న్యాయనిపుణులు
ప్రభుత్వ క్రీడ మైదానంలో సాంస్కృతిక వ్యాపారానికి అనుమతులు ఇచ్చిన అధికారులు ఈవెంట్ ముగిసిన అనంతరం సైతం న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోక తప్పదని భద్రాచలం పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. అడ్డదారిలో అనుమతులు ఇచ్చినప్పటికీ ప్రజా వ్యతిరేకత ప్రజాసంఘాల విన్నపలనంతరమైన అనుమతులు రద్దు చేయకంటే ఈవెంట్ అనంతరం ఎదురయ్యే సమస్యలకు అధికారులే సమిధులవుతారని పలువురు హెచ్చరిస్తున్నారు. కళాశాల క్రీడా మైదానం పరిమితులను పరిగణం లోకి తీసుకోకుండా యువతను రెచ్చగొట్టే జబర్దస్త్ ఈవెంట్ నిర్వహిస్తే అతి తక్కువ ఎత్తు గల గోడల పై నుండి ఆకతాయిలు మైదానంలోకి ప్రవేశించి మహిళలను యువతులను ఇబ్బందులు గురి చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారని పలువురు అనుమానాలని వ్యక్తం చేస్తున్నారు. జరుగుతున్న పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకొని అధికారుల నిర్ణయం పైనే జబర్దస్త్ నిర్వహణ ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది.
అశ్లీల జబర్దస్త్ పై నీలి నీడలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



