Tuesday, April 14, 2026
E-PAPER
Homeజాతీయంలోక్ స‌భ స్థానాలు 850కు పెంపు..?

లోక్ స‌భ స్థానాలు 850కు పెంపు..?

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కేంద్ర ప్ర‌భుత్వం లోక్ స‌భ సీట్ల పెంపు విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతుంది. లోక్ స‌భ‌ సీట్ల‌ను 850కి పెంచనున్న‌ట్లు స‌న్నాహాలు చేస్తోంద‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఈనెల 16న మ‌హిళ రిజ‌ర్వేష‌న్ బిల్లుతో పాటు స‌దురు అంశాన్ని కూడా ప్ర‌వేశ‌పెట్టున్న‌ట్లు కేంద్రం స‌మాలోచ‌న చేస్తోంది. అందులో 815 స్థానాలు రాష్ట్రాల‌కు, మిగిలిన 35 సీట్లు కేంద్ర పాలిత రాష్ట్రాల‌కు కేటాయించ‌నున్నారు. ప్రస్తుతం లోక్‌సభలో 543 సీట్లు ఉన్నాయి. 2029 నుండి లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు కోసం ఏప్రిల్ 16, 17, 18 తేదీలలో జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఉద్దేశిస్తోంది. బడ్జెట్ సమావేశాల ప్రత్యేక సమావేశంలో నారీ శక్తి వందన అధినియమ్, 2023కు సవరణలు మరియు ప్రతిపాదిత డీలిమిటేషన్ బిల్లుపై చర్చించనున్నారు.

మ‌రోవైపు స‌మ‌గ్ర చ‌ర్చ జ‌ర‌గ‌కుండా మ‌హిళ రిజ‌ర్వేష‌న్ బిల్లుపై పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్ట‌డంపై ప్ర‌తిప‌క్షాలు ప‌లు సందేహాలు లెవ‌నెత్తుతున్నాయి. డిలిమిటేష‌న్ అంశంలో కూడా విప‌క్షాల ప్ర‌శ్న‌ల‌కు మోడీ ప్ర‌భుత్వం బదులివ్వ‌డంలేద‌ని మండిప‌డుతున్నాయి. జ‌నాభా లెక్క‌లు జ‌ర‌ప‌కుండా లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు, పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల పెంపు అనేది సాధ్య‌కాద‌ని విప‌క్షాలు ఆరోపిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -