Tuesday, April 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్రధాని మోడీకి సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ..

ప్రధాని మోడీకి సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్లతో డీలిమిటేషన్‌కు ముడిపెట్ట వద్దన్నారు. లోక్‌సభ నియోజకవర్గాల పెంపుపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలని కోరారు. జాతీయస్థాయిలో విస్త్రృత అభిప్రాయ సేకరణ తర్వాతే డీలిమిటేషన్‌ చేయాలని కోరారు.

‘‘కీలక నిర్ణయాల్లో రాష్ట్రాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలి. డీలిమిటేషన్‌పై అన్ని రాష్ట్రాలు, రాజకీయపార్టీల ఏకాభిప్రాయం సాధించాలి. నియోజకవర్గాల పెంపులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దు. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ పార్టీ పూర్తి మద్దతిస్తుంది. తక్షణమే ఈ రిజర్వేషన్లు అమలు చేయాలి. పెంచాలనుకుంటున్న 272 లోక్‌సభ సీట్లలో 50 శాతం అంటే..136 ప్రొరేటా(జనాభా ప్రాతిపదికన), మిగిలిన 50శాతం (136 సీట్లు) రాష్ట్రాల స్థూల ఆర్థికవృద్ధి రేటు ఆధారంగా పునర్విభజన చేయాలి’’ అని రేవంత్‌రెడ్డి తన లేఖలో పేర్కొ్న్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -