Tuesday, April 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఏవైఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

ఏవైఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని ఉప్లూర్ గ్రామంలో మంగళవారం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పంచాశీలా జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు, న్యాయవాది సుంకరి విజయ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం ఒక్క కులానికో, మతానికో, జాతికో, ప్రాంతానికో మాత్రమే అంకితం కాదన్నారు.

ఆయన ఒక గొప్ప సామాజిక శాస్త్రవేత్త, ప్రపంచంలో మరెవరూ చదవలేనన్ని డిగ్రీలను అందుకున్న ప్రపంచ మేధావి అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, అన్నిటికంటే ముఖ్యంగా ఒక మానవతావాది, స్వేచ్చ, సమానత్వ స్థాపన కోసం జీవితాంతం పోరాడిన గొప్ప సామాజిక విప్లవకారుడని తెలిపారు. ప్రపంచమే అతని పుట్టినరోజును జ్ఞానం పుట్టినరోజుగా, ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా అభివర్ణించింది అంటే అర్థం చేసుకోవచ్చన్నారు. అటువంటి మహనీయుడు మన భారత భూమిపై పుట్టినందుకు భారతీయులందరం గర్వపడాల్సిన విషయమని పేర్కొన్నారు.

ఆయన భారత భూమిపై నడయాడిన ఒక గ్రేటెస్ట్ ఇండియన్ అని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎనుగందుల శైలేందర్, ఉప సర్పంచ్ శేఖర్, ఆర్మూర్ కోర్ట్ ఎజిపి చిన్నారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు టీ.శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి ఏలేటి మోహన్ రెడ్డి, ప్యాక్స్ మాజీ చైర్మన్, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు దేవేందర్, బీజేపీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు సదానంద్, మాజీ సర్పంచ్ రమేష్ యాదవ్, వార్డ్ సభ్యులు దాసరి రాకేష్, విభూది అనిల్, అజయ్ గౌడ్, అంజిత్, సురేష్, లెక్చరర్ సాయన్న, పత్రి రవి, మహిళలు, గ్రామ యువత, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -