న్యూస్ క్లిక్‌పై ఢిల్లీ హైకోర్టు తీర్పును
స్వాగతించిన సీపీఐ(ఎం)
పత్రికా స్వేచ్ఛకు దక్కిన విజయం
న్యూస్ క్లిక్‌పై ఢిల్లీ హైకోర్టు తీర్పును
స్వాగతించిన సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ : న్యూస్‌క్లిక్‌పై ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పును సీపీఐ(ఎం) స్వాగతించింది. రాజకీయ ప్రతీకారేచ్ఛ కోసం ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేసేవారికి ఈ తీర్పు ఒక తీవ్ర హెచ్చరిక అని వ్యాఖ్యానించింది. న్యూస్ క్లిక్‌పై, దాని ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థపై ఢిల్లీ పోలీసులకు చెందిన ఆర్థిక నేరాల విభాగం దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పెట్టిన కేసును కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో స్వాగతించింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. దేశంలో మెజారిటీ మీడియా సంస్థలు కార్పొరేట్-రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న సమయంలో, అధికారంలో వున్న వారిని, వారిని సమర్ధించే కార్పొరేట్ సంస్థలను ప్రశ్నించే న్యూస్ క్లిక్ వంటి సంస్థల గొంతుకలు తీవ్ర దాడులకు గురవుతున్నాయి. ప్రజా ఉద్యమాల గురించి వారు నిర్భయంగా చేసిన వార్తా కథనాల వల్లనే వారిపై ఈ కల్పితమైన అభియోగాలు మోపారు, ఇప్పడు వాటిని కొట్టివేశారని పొలిట్‌బ్యూరో పేర్కొంది.
ఏడాది పాటు సాగిన రైతుల పోరాటంపై వార్తలు, విశ్లేషణ, వీడియోలతో నిరంతరాయంగా న్యూస్‌క్లిక్ కథనాలు అందచేయడం బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా మారింది. ఈ పరిస్థితి, ఆ న్యూస్పోర్టల్పై దాడి ఉధృతమవడానికి, అలాగే నిరంకుశమైన యుఎపిఎను మోపుతూ, పుర్కాయస్థను దీర్ఘకాలం పాటు కారాగారంలో నిర్బంధించడానికి దారి తీసింది.న్యూస్ క్లిక్‌పై, పుర్కాయస్థపై కేంద్ర ప్రభుత్వ సంస్థలు తీసుకున్న చర్యలు విమర్శనాత్మక జర్నలిజాన్ని లక్ష్యం చేసుకునే, అసమ్మతిని అణచివేసే కుట్ర తప్ప మరొకటి కాదని ఆది నుండి స్పష్టమవుతునే వుంది. అందువల్ల, ఈ తీర్పు పత్రికా స్వేచ్ఛకు, పౌరుల ప్రజాస్వా మ్య హక్కులకు ఒక విజయమని పొలిట్‌బ్యూరో పేర్కొంది.న్యూస్‌క్లిక్‌పై ఈడీ పెట్టిన కేసు న్యాయ ప్రక్రియను దారుణంగా దుర్వినియోగం చేయడమేనని ఢిల్లీ హైకోర్టు తన తీర్పులో స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో, న్యూస్‌క్లిక్‌పై, ప్రబీర్ పుర్కా యస్థపై కేంద్ర ప్రభుత్వ సంస్థలు పెట్టిన ఇతర కేసులన్నింటినీ కొట్టివేయాలని కేంద్రాన్ని, కేంద్ర ప్రభుత్వ సంస్థలను సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తోంది.
పత్రికా స్వేచ్ఛకు దక్కిన విజయం
- Advertisement -
- Advertisement -



