Saturday, June 13, 2026
E-PAPER
Homeజాతీయంజవాబుదారీతనమేది?

జవాబుదారీతనమేది?

- Advertisement -

భారత్ తీరు సరికాదు
అమెరికా సామ్రాజ్యవాదం 
నిర్లక్ష్య వైఖరి
ముగ్గురు భారత నావికుల హత్యను ఖండించిన సీపీఐ(ఎం)

న్యూఢిల్లీ : గల్ఫ్‌ ప్రాంతంలోని చమురు ట్యాంకర్‌ ఎంటి సెటిబెల్లొపై జరిగిన దాడిలో ముగ్గురు భారత నావికులు మరణించడాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. పశ్చిమాసి యాలో అమెరికా సామ్రాజ్యవాదం నిర్లక్ష్యపూరి తంగా, దూకుడుగా పాల్పడుతున్న సైనిక చర్యల పర్యవసానాల వల్లనే ఈ విషాదకర సంఘటన జరిగిందని పొలిట్‌‌బ్యూరో పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా సామ్రాజ్యవాద ధోరణి పశ్చిమాసియాను అస్థిరపరుస్తూ, అంతర్జాతీయ శాంతికి ముప్పుగా మారిందని, అమాయకులైన పౌరులు, కార్మికుల ప్రాణాలకు ప్రమాదకరంగా పరిణమించిందని పేర్కొంది. మరణించిన భారత నావికులైన ఆదిత్య శర్మ, శివానంద్‌ ‌చౌరాసియా, పట్నాల సురేష్‌‌లు పౌర నావికులు, వారి విధులను నిర్వరిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. వారు సైనికులు కాదు, వారికి ఎలాంటి సైనిక లేదా భౌగోళిక, రాజకీయ ఘర్షణల్లో ఎటువంటి పాత్ర లేదని తెలిపింది. బాధిత కుటుంబాలకు సీపీఐ(ఎం) సంతాపాన్ని తెలియచేసింది. సైన్యం పాల్పడే దుస్సాహస చర్యలకు, భౌగోళిక, రాజకీయ అధికార పోరాటాలకు బాధితులుగా మారుతున్న నావికులు, సముద్ర జలాల కార్మికులు, సిబ్బందికి పొలిట్‌‌బ్యూరో సంఘీభావాన్ని ప్రకటించింది.

సీఐటీయూ అనుబంధ సంఘమైన ఫార్వర్డ్‌ సీమెన్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా ‌నుండి అందిన సమాచారం ప్రకారం, హర్మూజ్‌ ‌జలసంధికి సమీపంలో పయనిస్తుండగా, పెద్ద సంఖ్యలో భారత సిబ్బంది వున్న ఎంటి సెటిబెల్లొపై దాడి జరిగింది. ఈ ప్రాంతంలోని వాణిజ్య నౌకలపై జరిగిన ఇతర సంఘటనల తర్వాత ఈ దాడి జరిగింది. ఇది, పౌర నౌకాయానానికి పెరుగుతున్న అభద్రతా భావాన్ని తెలియచేస్తోందని పొలిట్‌‌బ్యూరో వ్యా ఖ్యానించింది. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై మౌనం పాటించడం సిగ్గుచేటని, ఈ దాడికి పాల్పడిన వారిని స్పష్టంగా గుర్తించడాని కి, బాధ్యులైన వారి చర్యలను ఖండించడానికి తిరస్కరించడాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా గర్హించింది. ఈ దాడిని భారత ప్రభుత్వం ఖండించాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ ‌చేసింది. భారత పౌరుల మృతికి జవాబుదారీ కావాలని కోరింది. ఘర్షణలు చెలరేగుతున్న ప్రాంతాల్లో పనిచేస్తున్న భారత నావికుల భద్రత, రక్షణకు హామీ కల్పిస్తూ అవసరమైన అన్ని దౌత్య చర్యలు చేపట్టాలని కోరింది.

అమెరికా దౌత్యవేత్తకు భారత్ సమన్లు
గల్ఫ్ ప్రాంతంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న మరో వాణిజ్య నౌకపై అమెరికా దళాలు దాడి చేశాయి. ఈ నేపథ్యంలో, రెండోసారి అమెరికా దౌత్యవేత్త జసన్ మీక్స్‌కు భారత విదేశాంగ శాఖ శుక్రవారం సమన్లు జారీ చేసింది. నాలుగు రోజుల వ్యవధిలో భారత సిబ్బంది ఉన్న నౌకలపై మూడు సార్లు దాడులు చేసింది. ఈ ఘటనపై భారత్, అమెరికా దౌత్యవేత్త జాసన్ మీక్స్‌ను పిలిపించి చర్చించినట్లు తెలుస్తోంది. వరసగా జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే గల్ఫ్, హార్ముజ్ జలసంధి, సమీప సముద్ర ప్రాంతాల్లో పనిచేస్తున్న దాదాపు 18 వేల మంది భారతీయ సిబ్బందికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీఎస్) భద్రతా హెచ్చరికలు జారీ చేసింది. వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.ప్రస్తుతం హర్ముజ్ జలసంధికి సమీపంలో ప్రయాణిస్తున్న 13 భారత జెండా కలిగిన నౌకల్లో 622 మంది భారతీయ నావికులు ఉన్నారు. అంతేకాకుండా గల్ఫ్ ప్రాంతంలో వందలాది విదేశీ జెండాలు కలిగిన నౌకల్లో దాదాపు 18 వేల మంది భారతీయులు విధులు నిర్వహిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -