రాష్ట్రంలో 51 బీసీ కులాలకు ‘సంచార, విముక్త తెగలు’గా గుర్తిస్తూ జీవో జారీ
వాల్మీకి సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా కన్వీనర్ కాంగ్రెస్ నాయకులు మండ్ల దేవన్న నాయుడు
నవతెలంగాణ-వనపర్తి
రాష్ట్రంలోని సంచార, అర్ధ సంచార, విముక్త (డీనోటిఫైడ్) జాతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించిందని వాల్మీకి సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా కన్వీనర్ కాంగ్రెస్ నాయకులు మండ్ల దేవన్న నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఎంతో కాలంగా గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న 51 వెనుకబడిన వర్గాల (బీసీ) కమ్యూనిటీలను అధికారికంగా ‘విముక్త, సంచార, అర్ధ సంచార తెగలు (డీఎన్టీ)’గా గుర్తిస్తూ ప్రభుత్వం శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ జీవో నంబర్ 10ని విడుదల చేశారు. దశాబ్దాలుగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఆయా వర్గాల విద్య, ఉపాధి, సంక్షేమ రంగాల అభివృద్ధికి ఈ నిర్ణయం సరికొత్త బాటలు వేయనుంది.
తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ సుదీర్ఘ అధ్యయనం అనంతరం అందించిన సమగ్ర నివేదిక, సిఫార్సుల ఆధారంగా రాష్ట్ర క్యాబినెట్ ఈ కీలక నిర్ణయానికి ఆమోద ముద్ర వేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమల్లో ఉన్న బీసీ ‘ఏ’, బీసీ-ఈ. ‘ గ్రూపుల జాబితాను కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి . వనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే తూడిమేఘా రెడ్డి గార్లకు ప్రత్యేకత కృతజ్ఞతలు తెలుపుతూ ప్రభుత్వ. గతంలో వాల్మీకి బోయలు ఎస్టీలోగా ఉన్నారు వారిని తిరిగి ఎస్టి జాబితాలను పునరుద్ధరించాలని కోరారు గుర్తింపు పొందిన 51 వర్గాల్లో అత్యధికంగా బీసీ-ఏ గ్రూపునకు చెందిన 49 కమ్యూనిటీలు ఉండగా, బీసీ-ఈ గ్రూపునకు చెందిన రెండు కమ్యూనిటీలు చోటు దక్కించుకున్నాయి.
ఇందులో ప్రధానంగా,బాలసంతు, బుడబుక్కల వాల్మీకి బోయ,(శివ క్షత్రియ),దాసరి (భిక్షాటన చేసేవారు), గంగిరెడ్లవారు, జంగం, జోగి, కాటిపాపల, మేదరి, పాముల, పార్థి, పాంబల, వీరభద్రీయ, వడ్డెర (ఒడ్డె), మందుల, పరికముగ్గుల వంటి సంచార జాతులు ఉన్నాయి. మైనారిటీ వెనుకబడిన వర్గాలకు చెందిన ఫకీర్, బుద్బుడ్కి, గుడ్డి ఎలుగువాళ్లు, తురక, గంటి ఫకీర్ వంటి కమ్యూనిటీలు కూడా ఈ డీనోటిఫైడ్ (డీఎన్టీ) జాబితాలోకి చేరాయి. ఆయా తెగలకు కేంద్ర, రాష్ట్రాల ప్రత్యేక పథకాలు, నిధులు, సంక్షేమ ప్రయోజనాలు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌తో పాటు జిల్లా కలెక్టర్లందరికీ రాష్ట్రప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారని దేవన్న నాయుడు తెలిపారు.



