నవతెలంగాణ-కంఠేశ్వర్
కులవివక్ష పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండగంగాధర్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో ముబారక్ నగర్ కార్పొరేట్ ఏరియా పరిధిలోని గ్రామ ప్రభుత్వ భూమిని, పశువులను పడుకోబెట్టే స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసి, ప్లాట్లుగా విభజించి అమ్ముకునే ప్రయత్నం జరుగుతోందని, ఈ విషయమై జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు వెంటనే ఏరియాలో ప్రభుత్వ భూమిని పరిశీలించాలని కోరారు. వాటర్ ట్యాంక్ పక్కన, ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ పక్కన ఉన్న స్థలాన్ని ప్రయివేటు వ్యక్తుల నుండి ప్రభుత్వ భూమిని కాపాడాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇల్లు స్థలము లేని పేదవారికి ఆ స్థలాలను కేటాయించాలని సూచించారు. లేనియెడల పేదలకు గుడిసెలు వేసి, వారికి వారు ఉపయోగించుకునేలా చేస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వ భూమి కబ్జాపై కేవీపీఎస్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో వినతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



