Monday, June 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వర్షం కోసం గ్రామదేవతలకు జలాభిషేకం

వర్షం కోసం గ్రామదేవతలకు జలాభిషేకం

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలో సోమవారం వరుణుడు కరుణించాలని గ్రామ దేవతలకు భాజా భజంత్రీలతో జలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలోని నడిమి హనుమాన్ ఆలయం వద్ద మహా అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రతి సంవత్సరం మృగశిర కార్తి ప్రారంభం కాగానే నడిమి హనుమాన్ ఆలయ అభివృద్ధి కమిటీ నిర్వాహకులు గ్రామ దేవతలకు జలాభిషేకాలు చేశారు. మృగశిర కార్తి ప్రారంభమైనప్పటికీ వర్షాలు పడనందున ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం హనుమాన్ ఆలయం వద్ద మహన్నదానం నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -