Monday, June 15, 2026
E-PAPER
Homeజిల్లాలుసీపీఐ(ఎం) పోరాట ఫలితం.. ఆర్అండ్‌బీ బ్రిడ్జిపై ప్రమాద సూచికలు ఏర్పాటు

సీపీఐ(ఎం) పోరాట ఫలితం.. ఆర్అండ్‌బీ బ్రిడ్జిపై ప్రమాద సూచికలు ఏర్పాటు

- Advertisement -

ఆర్అండ్‌బీ, మున్సిపల్ అధికారులకు సీపీఐ (ఎం) ధన్యవాదాలు
నవతెలంగాణ-ఆలేరు రూరల్ 

ఆలేరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబి)పై వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో సీపీఐ(ఎం) చేపట్టిన పోరాటం ఫలితంగా అధికారులు స్పందించి ప్రమాద సూచికలు, డివైడర్లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆర్అండ్‌బీ శాఖ, ఆలేరు మున్సిపల్ అధికారులకు సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ధన్యవాదాలు తెలిపింది. ఇటీవల ఈ బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎర్ర ఉదయ్, సుంకరి శ్రీనాథ్ మృతి చెందగా, ప్రమాద స్థలంలో సీపీఐ(ఎం) నాయకులు వారికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించి నిరసన వ్యక్తం చేశారు.

అనంతరం బ్రిడ్జిపై నెలకొన్న ప్రమాదకర పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) ఈ సమస్యపై ఆందోళన వ్యక్తం చేయడంతో అధికారులు స్పందించారు. సోమవారం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆర్అండ్‌బీ, మున్సిపల్ శాఖ అధికారులు బ్రిడ్జిపై ప్రమాద సూచికలు, డివైడర్లు ఏర్పాటు చేసి వాహనదారులకు హెచ్చరికలు కనిపించేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) పట్టణ కమిటీ నాయకులు మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించే విషయంలో అధికారులు వెంటనే స్పందించడం అభినందనీయమని అన్నారు. అయితే భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా బ్రిడ్జిపై మరిన్ని భద్రతా చర్యలు చేపట్టాలని, రాత్రి వేళల్లో స్పష్టంగా కనిపించేలా రేడియం బోర్డులు, హెచ్చరిక లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) నిరంతరం పోరాడుతుందని, ప్రజల భద్రతకు సంబంధించిన అంశాల్లో అధికారులు మరింత చొరవ చూపాలని సీపీఐ(ఎం) పట్టణ కమిటీ విజ్ఞప్తి చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -