వైస్ కెప్టెన్‌గా నితిన్ సాయి యాదవ్
నవతెలంగాణ-హైదరాబాద్ : టీజీ20 లీగ్ ప్రాంఛైజీ ప్రణవ రంగారెడ్డి రైజర్స్ (ఆర్‌ఆర్‌ఆర్) అరంగేట్ర సీజన్‌కు తమ కెప్టెన్‌గా స్టార్ స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్‌ను ఎంచుకుంది. వైస్ కెప్టెన్‌గా నితిన్ సాయి యాదవ్ వ్యవహరించనున్నాడు. ఈ మేరకు ప్రణవ రంగారెడ్డి రైజర్స్ యాజమాని సాయి రెడ్డి, రవి గుప్తాలు సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. టీజీ20లో పోటీపడుతున్న ఆర్‌ఆర్‌ఆర్ జట్టుకు ఇంగ్లాండ్‌కు చెందిన స్పార్టన్స్ క్రికెట్ క్లబ్ ఎసెక్స్ సంస్థ మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంకేతికత, స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ సహా కోచింగ్, ఆటగాళ్ల డెవలప్‌మెంట్‌లకు సహకారం అందించనుందని తెలిపారు. టీజీ20 లీగ్ ఈ నెల 21 నుంచి ఆరంభం కానుంది.
ఆర్ఆర్ఆర్ కెప్టెన్‌గా తనయ్
- Advertisement -
- Advertisement -



