Tuesday, June 16, 2026
E-PAPER
Homeఆటలుటెక్నాలజీతో క్రీడల్లో మార్పు

టెక్నాలజీతో క్రీడల్లో మార్పు

- Advertisement -

భారత క్రికెటర్‌ యుజ్వెంద్ర చాహల్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌ :
స్పోర్ట్స్‌, వెల్‌‌నెస్‌, ఫిట్‌‌నెస్‌, టెక్నాలజీ స్టార్టప్‌‌లకు స్పింట్‌ఎక్స్‌ ‌సంస్థ మార్గదర్శిగా పని చేయనుందని భారత క్రికెటర్‌ ‌యుజ్వెంద్ర చాహల్‌ అన్నారు. సోమవారం హైదరాబాద్‌‌లో జరిగిన కార్యక్రమానికి సహచర క్రికెటర్‌ ‌జయంత్‌ ‌యాదవ్‌‌తో కలిసి చాహల్‌ ‌ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘టెక్నాలజీ క్రీడల స్వరూపం మార్చివేసింది. గేమ్‌ ‌ప్లానింగ్‌, స్ర్టాటజీ, ప్రిపేర్డ్‌‌నెస్‌‌తో పాటు ఫిట్‌‌నెస్‌, వెల్‌‌నెస్‌ ‌పరంగా సాంకేతికత అందిస్తున్న సేవలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. బ్యాటర్ల బలహీనతలను అంచనా వేయటం, ఏ లెంగ్త్‌‌లో బంతి వేయాలి, పిచ్‌‌పై ఎక్కడ బంతులు వేయకూడదు వంటి అంశాలల్లో సన్నద్ధతతకు టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఈ కార్య‌క్ర‌మంలో స్ప్రింట్ఎక్స్ మెంటార్‌ జీఆర్ రెడ్డి, హైద‌రాబాద్ ఏంజెల్స్ సీఈఓ ర‌త్నాక‌ర్‌, లెగ‌సీ సంస్థ స‌హ‌ వ్య‌వ‌స్థాప‌కులు మ‌హ్మ‌ద్ సిరాజుద్దీన్‌, కార్తీక్‌ ‌యనమండ్ర, అమితేష్, సక్సీడ్ వెంచర్స్ విక్రాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -