- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో అవినీతి తిమింగలాల వేటలో ఎసీబీ మరోసారి గట్టి దెబ్బ కొట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి లక్ష్యంగా ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం నుంచి విస్తృత తనిఖీలు చేపట్టారు. నగరంలోని నరహరి నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన ఆఫీసులు, బంధువులు, అత్యంత ఆప్తుల ఇళ్లలో ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని దాదాపు 10 విభిన్న ప్రాంతాలలో ఈ దాడులు కొనసాగుతున్నాయి.
- Advertisement -



