Thursday, June 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలురజనీకాంత్- కమల్ హాసన్'ధర్మన్` మొదలైంది

రజనీకాంత్- కమల్ హాసన్’ధర్మన్` మొదలైంది

- Advertisement -

రజనీకాంత్ హీరోగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త చిత్రం ‘ధర్మన్’ షూటింగ్‌ను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బుధవారం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించారు. ‘ది డెడ్లీ డాక్టర్’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ సినిమాలో సిమ్రాన్, రాశీ ఖన్నా నటిస్తుండగా, అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు.
కమల్ హాసన్ మాట్లాడుతూ,’రజనీకాంత్‌తో నాకు దాదాపు 50 ఏళ్ల స్నేహం, ప్రయాణం ఉంది. మేమిద్దరం కలిసి సినిమా చేయాలనేది ఎప్పటి నుంచో ఉన్న కోరిక. ఆ కల ఇప్పుడు ఒకటి కాదు, రెండు సినిమాల రూపంలో నిజమవుతోందిఅని అన్నారు. 'కమల్, నేను ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. కథ విషయంలో నా నిర్ణయంపై కమల్ పూర్తి నమ్మకం ఉంచినప్పుడు నాకు మరింత బాధ్యతగా అనిపించింది. అశ్వత్ ఎంతో ప్రతిభావంతమైన దర్శకుడు అన రజనీకాంత్ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -