Wednesday, June 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅందర్నీ మెప్పించే 'సూపర్ సుబ్బు

అందర్నీ మెప్పించే ‘సూపర్ సుబ్బు

- Advertisement -

నెట్‌ఫ్లిక్స్ తన తొలి తెలుగు ఒరిజినల్ కామెడీ సిరీస్ ‘సూపర్ సుబ్బు’ ట్రైలర్‌ను విడుదల చేసింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ,' సాధా రణంగా ప్రజలు మాట్లాడటానికి సంకోచించే అం శాన్ని హాస్యం, హృదయానికి హత్తుకునే భావోద్వేగాలతో చెప్పే ప్రయత్నం చేశాం. సుబ్బు ఒక సమస్యను పరిష్కరిం చాలనుకుని చివరికి మరిన్ని సమస్యల్లో చిక్కు కుంటాడు. ఉద్యోగ సమస్యలు, ప్రేమలో ఎదురయ్యే ఇబ్బందులు, కుటుంబ ఒత్తిళ్లు, గ్రామస్తులతో వచ్చే అపార్థాలు మరింత వినోదాత్మకంగా ఉంటాయి. మాకి పూర్‌లోని ప్రతి పాత్ర ప్రత్యేకం అని తెలిపారు.
‘హాస్యంతో పాటు మానవ సంబంధాలు, అంగీకారం, పరస్పర అవగాహన వంటి అంశాలను ఎంతో అందంగా చెప్పిన కథ ఇది` అని మిథిలా పాల్కర్ చెప్పారు. మల్లిక్ రామ్, రమేష్ ఎలిగేటి, శివాని ధోబాల్ రచించిన ఈ సిరీస్‌ను చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, భరత్ లక్ష్మీపతి నిర్మించారు. గెటప్ శ్రీను, మానసా చౌదరి, జీవన్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషించారు. హాస్యం, భావోద్వేగాలు, చిన్న పట్టణ జీవన శైలిలోని సరదా సంఘటనలను మేళవిస్తూ రూపొందిన ‘సూపర్ సుబ్బు’ ప్రేక్షకులకు ఓ వినూత్న అనుభూతిని అందించనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -