Wednesday, June 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'సర్దార్ 2` రిలీజ్ డేట్ ఫిక్స్

‘సర్దార్ 2` రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -


కార్తి హీరోగా తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’కి సీక్వెల్ ‘సర్దార్ 2’ ప్రేక్షకులు ముందుకు రానుంది. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్నాయి. తాజాగా చిత్రబృందం విడుదల తేదీని ప్రకటించింది. ఈ చిత్రం సెప్టెంబర్ 10న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ప్రత్యేక ఆకర్ష ణగా నిలిచింది. అగ్నిపర్వతంలా ఎగిసిపడుతున్న పేలుడు నేపథ్యం లో, చేతిలో తుపాకీతో ధైర్యంగా నిలబడ్డ హీరో లుక్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. స్టైలిష్‌గా, ఇంటెన్స్‌గా డిజైన్ చేసిన ఈ పోస్టర్ కథలోని యాక్షన్ సూచిస్తూ ప్రేక్షకుల్లో క్యూరియా సిటీని రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో మాళవిక మోహన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తుండగా, ఎస్ జె సూర్య ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం – పిఎస్ మిత్రన్, సహ నిర్మాత – ఎ. వెంకటేష్, నిర్మాతలు – ఎస్. లక్ష్మణ్ కుమార్, ఇషాన్ సక్సేనా, సంగీతం – సామ్ సిఎస్, డీఓపీ – జార్జ్ సి విలియమ్స్, ఎడిటర్ – విజయ్ వేలుకుట్టి, ప్రొడక్షన్ డిజైన్ – రాజీవ్ నంబియార్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ – ఏపీ పాలపాండి, ఆర్ట్ – ఎంఎస్పి మాధవన్, బి.శేఖర్, స్టంట్ – దిలీప్ సౌండ్ డిజైన్ – తపస్ నాయక్, రైటర్స్ – రత్న కుమార్, ఆషామీర అయ్యప్పన్, విఘ్నేష్ మునియాండి స్క్రీన్ ప్లే – నంబి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -